కవిత – నేను డక్కాముక్కీలు తిన్నాం… కేటీఆర్

0
54

తాను, తన సోదరి కవితలు డక్కాముక్కీలు తిన్నాం.. ఒక్క ఓటమికే కుంగిపోయే ప్రసక్తే లేదని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన తెరాస సీఎం కేసీఆర్ కుమార్తె కె.కవిత బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. దీనిపై కేటీఆర్ స్పందించారు. కవిత తాను అనేక డక్కాముక్కీలు తిన్నాం. ఒక్క ఓటమితో కుంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.

పైగా, నిజామాబాద్‌లో కవిత ఓటమికి రైతులు కారణం కాదన్నారు. అక్కడ నామినేషన్లు వేసింది రైతులు కాదనీ, రాజకీయ కార్యకర్తలేనని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలో ఓ కాంగ్రెస్ నేత ఇంటి నుంచి 93 మంది నామినేషన్లు వేశారని గుర్తుచేశారు.

పైగా, ఈ లోక్‌సభ ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లతో 11 సీట్లు కైవసం చేసుకుంటే ఈ దఫా ఆరు శాతం ఓట్లు పెరిగినా కేవలం 9 సీట్లకే పరిమితమయ్యామని కేటీఆర్ గుర్తుచేశారు. దీనిపై సమీక్షలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తాను ఫెయిల్ కాలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.