ఆ మూడు వుంటే మూడు ముళ్లు వేయించుకుంటా…

0
32
Rakul Preet Singh
Rakul Preet Singh

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటు టాలీవుడ్, అటు హాలీవుడ్, కోలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో చేతినిండా చిత్రాలు పెట్టుకుని బీజీగా ఉన్న హీరోయిన్.

హిందీలో విడుదలై దేదే ప్యార్ దే చిత్రం సూపర్ హిట్ కాగా, రకుల్ నటించిన తమిళ చిత్రం మే 31వ తేదీన రిలీజ్ కానుంది.ఇలా వరుస ప్రాజెక్టులు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా తన మనసులోని మాటను వెల్లడించింది. ఇంతవరకు ప్రేమలోపడలేదని చెప్పింది. అయితే, తనకు కాబోయే భర్తలో కొన్ని లక్షణాలు ఖచ్చితంగా ఉండాలని చెబుతోంది.

తన కాబోయే భర్త ఎత్తు కనీసం 6 అడుగులు ఉండాలి. అతనికి ఫ్యాషన్ ఓ లక్ష్యంగా ఉండాలనీ, సెన్సాఫ్ హ్యూమర్ తప్పనిసరి అని చెప్పుకొచ్చింది. ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే తనను సంప్రదించవచ్చని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఈ మూడు లక్షణాలు ఉండేవారు తారసపడితే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని రకుల్ చెబుతోంది.