‘దొరసాని’గా శివాత్మిక ఏముందిరా బాబూ?

0
62

సినీ నటి జీవితా రాజశేఖర్‌ దంపతుల రెండో కుమార్తె శివాత్మిక. ఈమె టాలీవుడ్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి “దొరసాని” అనే టైటిల్‌ను ఖరారు చేయగా, కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ ‘దొరసాని’ మూవీ ఫస్ట్ లుక్‌ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను నిశితంగా పరిశీలిస్తే, గ్రామీణ నేపథ్యంలో దొరవారి కుటుంబానికి చెందిన యువతిగా శివాత్మిక నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈమె కారులో వెళుతుంటే ఒక పేద యువకుడు ఆ కారు పక్కనే సైకిల్‌పై వెళుతూ కనిపిస్తాడు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తుంది. ఇదే ఈ చిత్ర కథ. ఈ పోస్టర్‌ను బట్టి చూడగా ఇదే అర్థమవుతోంది. జూలై 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌లో శివాత్మిక అదరగొట్టేసింది.