ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమై గంటపాటు చర్చించారు. ముఖ్యంగా, సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో నరేంద్ర మోడీ హవా, కాంగ్రెస్ పార్టీ ఓటమితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఎన్సీపీ విలీనంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది.
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షపదవికి రాహుల్ రాజీనామా చేశారు. ఈ రాజీనామాపై ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. కానీ, పార్టీ సీనియర్ నేతలతో పాటు.. శరద్ పవార్ వంటి కురువృద్ధులు మాత్రం పార్టీ అధ్యక్షుడుగా కొనసాగాలని రాహుల్‌ను కోరుతున్నారు. తాజా భేటీలోనూ వారిద్దరి ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్టు సమాచారం.
ఈ భేటీ తర్వాత శరద్ పవార్ ఓ ట్వీట్ చేశారు. ఈ రోజు రాహుల్ మా ఇంటికి వచ్చి నన్ను కలిశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, దేశ వ్యాప్తంగా నెలకొన్న కరవు పరిస్థితులపై చర్చించాం అంటూ ఓ ట్వీట్ చేశారు.