పాపిస్టు డబ్బు నాకు వద్దు.. : ఫిదా భామ

0
66

సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనే ముఖ్యంగా ముందుకు సాగుతుంటారు. కానీ, సాయిపల్లవి వంటి హీరోయిన్లు మాత్రం ఈ కోవకు చెందినవారు కాదని ఆమె ప్రత్యక్షంగా నిరూపించింది. కోట్లాది రూపాయలు ఆఫర్ చేసిన యాడ్‌లో నటించేందుకు ఆమె సమ్మతించలేదు. తనకు డబ్బు కంటే తన చుట్టూవున్నవారిని సంతోష పెట్టడమే ముఖ్యమని అంటున్నారు. ఈ వివరాలను పరిశీలిద్ధాం.

ఆ మధ్య ఓ సౌందర్య ఉత్పత్తుల సంస్థకు చెందిన యాడ్‌లో నటించేందుకు తిరస్కరించింది. పైగా, ఈ యాడ్‌లో నటిస్తే కోట్లాది రూపాయలను కూడా ఆఫర్ చేసింది. కానీ, సాయి పల్లవి నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. అలాంటి ప్రకటనల్లో నటించే డబ్బు తనకు అక్కర్లేదని తేల్చి చెప్పింది.

దీనిపై తాజాగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రపంచంలోని మనుషులంతా ఒకే రంగులో ఉండరు. అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉండేవారు తెల్లగా ఉంటారనీ, ఆఫ్రికా దేశాల్లో ఉండేవారు నల్లగా ఉంటారన్నారు. భారత్‌లో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటారని చెప్పారు.

అయితే, రంగుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అందంగానే ఉంటారని తెలిపింది. ఈ భావనతోనే ఆ సౌందర్య ఉత్పత్తుల సంస్థకు చెందిన యాడ్‌లో నటించేందుకు అంగీకరించలేదన్నారు. పైగా, ఇలాంటి యాడ్‌లలో నటించే డబ్బు తనకు అక్కర్లేదని చెప్పింది.

తనకు డబ్బు సంపాదించాలనీ, లగ్జరీ జీవితాన్ని అనుభవించాలన్న ఆశ, తపన లేదన్నారు. ప్రతిరోజూ షూటింగ్ ముగిసిన తర్వాత ఇంటికెళ్లి మూడు చపాతీలు ఆరగించి, తనకున్న కారులో షికారు చేస్తే చాలని, ఇదే తనకు ఆత్మసంతృప్తిని ఇస్తుందని తెలిపింది. తనకు డబ్బు సంపాదన ముఖ్యం కాదనీ, తన చుట్టూవున్నవారిని సంతోషంగా ఉంచడమే ప్రధానమని ఈ తెల్లపిల్ల సాయిపల్లవి చెప్పుకొచ్చింది.

కాగా, సాయిపల్లవి నటించిన చిత్రం “ఎన్.జి.కె”. ఈ చిత్రం మే 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించారు.