ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గంలో తెలుగింటి కోడలుకు కీలకపదవి దక్కింది. దేశ ఆర్థిక మంత్రిగా ఆమె నియమితులయ్యారు. ఎంఏలో ఆర్థిక శాస్త్రం పూర్తిచేసిన నిర్మలా సీతారామన్.. గత మంత్రివర్గంలో దేశ రక్షణ శాఖామంత్రిగా ఉన్నారు. ఇపుడు మరింత ప్రమోషన్ ఇచ్చి.. ఆర్థికమంత్రిగా నియమించారు. దీంతో ఆమె సరికొత్త రికార్డును నెలకొల్పారు.
పైగా, దేశ ఆర్థిక శాఖను నిర్వహించనున్న రెండో మహిళగా నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించనున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈమె 1970లో ఒక యేడాది పాటు ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వహించారు.
కాగా, మే 30వ తేదీ రాత్రి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేయగా, ఆయన తన మంత్రివర్గంలో 24 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర సహాయ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులను నియమించుకున్న విషయం తెల్సిందే.