ప్రేమలో పడిన తమన్నా… ప్రియుడు ఎవరో?

0
35
Tamanna Bhatia
Tamanna

తెలుగు సినీ ఇండస్ట్రీలో మిల్కీబ్యూటీగా పేరుగడించిన హీరోయిన్ తమన్నా. ఈమె ఇప్పటివరకు ఎలాంటి ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకోకుండా తన కెరీర్‌ను కొనసాగిస్తూ వస్తోంది. అయితే, ఉన్నట్టుండి తమన్నా తాజాగా ప్రేమపై ఓ కవిత రాసింది. దీంతో ఆమె ప్రేమలో పడిందన్న అనుమానాలు వస్తున్నాయి.

సెల్ఫ్ లవ్ పేరుతో రాసిన ఆ కవిత సినీ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ కవితను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. అది చూసి చక్కగా సినిమాలు చేసుకోక…ఇదెక్కడి వెర్రిరా బాబూ.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొందరు మాత్రం తమన్నా ప్రేమలో కానీ పడిందా? అందుకే ప్రేమపై కవిత్వం రాసిందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

క్యాప్షన్‌గా ‘నాకు కవిత్వం అంటే ఇష్టం. తరచు నేను నా మనసులోని ఆలోచనలకు అక్షరరూపం ఇస్తాను’ అని ఇచ్చింది. సినిమాలతో అంత బిజీగా ఉంటే, కవితలు రాసే తీరిక ఎక్కడ దొరుకుతుంది? అనే అనుమానాన్ని కూడా కొందరు సినీజనాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంమీద ఈ అవంతికకు ప్రేమ పుట్టిందనే అనుమానాలు వస్తున్నాయి.