ప్రేమ కవితలు రాస్తున్న త్రిష..

0
34

చెన్నై చిన్నది త్రిష. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అగ్ర కథనాయికగా కొనసాగింది. అగ్ర హీరోలందరితోనూ నటించింది ఇటీవ‌ల త‌మిళంలో ’96’ సినిమాతో భారీ విజ‌యాన్ని అందుకుంది. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది.

అయితే, ఈ అమ్మడు ఒకవైపు సినిమాలు చేస్తూనే పలు వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈమె వయసు 36 యేళ్లు. వ్యాపారవేత్త వరుణ్‌ మణియన్‌తో గ‌తంలో ప్రేమాయణం సాగించిన త్రిష ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. ఇక‌, పెళ్లే తరువాయి అనుకున్న స‌మ‌యంలో ఇద్ద‌రూ విడిపోయారు.

అప్పటి నుంచి ఇప్పటివరకు సింగిల్‌గా ఉంటున్నారు. ప్రేమదోమా అంటూ ఏది లేకుండా జీవితాన్ని గడిపేస్తోంది. అయితే, త్రిష ప్ర‌స్తుతం ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ట్విట‌ర్ ద్వారా ఓ అభిమాని అడిగిన ప్ర‌శ్న‌కు త్రిష ఇచ్చిన స‌మాధానం ఆ వార్త‌లకు బ‌లం చేకూరుస్తోంది.

“మీ రిలేష‌న్‌షిప్ స్టేట‌స్‌, పెళ్లి గురించి చెప్పండి” అని ఓ అభిమాని త్రిష‌ను ప్ర‌శ్నించాడు. దానికి స్పందించిన త్రిష ‘సింగిల్ బ‌ట్ టేకెన్’ అని ట్వీట్ చేసింది. ప్రేమ‌లో ఉన్న‌ట్టు ప‌రోక్షంగా హింట్ ఇచ్చింది. దీంతో త్రిష ప్రేమిస్తున్న వ్య‌క్తి ఎవ‌ర‌నే విష‌యం గురించి మీడియా ఆరాలు తీయ‌డం ప్రారంభించింది.