ఎండలో ఉదయించిన చందమామ .. ప్రగ్యా జైశ్వాల్

0
45

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. దీనికితోడు హీరోయిన్లు హాట్ హాట్ ఫోటోలకు ఫోజులిచ్చి టెంపరేచర్‌ను మరింతగా పెంచుతున్నారు. తాజాగా ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్ ఫోటోలను చూసిన కుర్రకారు సొంగకార్చుకుంటున్నారు.

కంచె చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ.. అక్కినేని నాగార్జున నటించిన “శ్రీరామదాసు” చిత్రంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటించింది. ఈ చిత్రంలో ఓ పాటలో తన అందచందాలను ఆరబోసి కుర్రకారు మతులుపోగొట్టింది.

తాజాగా హాట్ పోజులిచ్చి పగటి ఉష్ణోగ్రతలను మరింతగా పెంచింది. పొట్టిగా ఉండే నైట్ గౌన్ ధరిం ఒక గ్లాస్ వాల్‌కు ఆనుకుని నిలుచుని ఫోటోలకు ఫోజులిచ్చింది. పైగా తెల్లటి గౌను పారదర్శకంగా ఉండటంతో హాట్‌నెస్ మరింత రెట్టింపు అయింది.

ఒకవైపుకు స్టైలింగ్ చేసిన జుట్టును చేత్తో అలా అనుకుంటూ ఒక అందమైన పాలరాతి శిల్పంలా నిలబడింది. ఎంత వేడి పెంచినా నెటిజనులు కామెంట్లు పెట్టడం మాత్రం ఆపరు కదా ఒకరు ‘కిరాక్ పోజు.. హాట్ లెగ్స్’ అన్నారు. మరొకరు ‘వెరీ వెరీ ప్రెట్టీ’ అన్నారు. ఇంకొకరు ‘ధూప్ మే చాంద్ ఖిలా హై’ అర్థం అయింది కదా.. ఎండలో ఉదయించిన చందమామ అని కామెంట్లు పెట్టారు.