తెలుగు బుల్లితెరపై అందాలను ఆరబోస్తున్న హాట్ యాంకర్లలో అనసూయ భరద్వాజ్ ఒకరు. ఈమె అడపాదడపా బిగ్ స్క్రీన్‌పై కూడా కనిపిస్తూ సినీ ప్రేక్షకులను ఆలరిస్తోంది. ఆ మధ్య రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన రంగస్థలం చిత్రంలో రంగమ్మత్తగా మంచి పాత్రను పోషించింది. అంతకుముందు నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో హీరోకు మరదలుగా నటించింది.
అంతేనా… తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తు కుర్రకారును ఊపేస్తోంది. తాజాగా ఆమె ధరించిన డ్రెస్ హాట్ టాపిక్ అయింది. ఆమె అందాన్ని మరింత పెంచిందని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య సమ్మర్ టూర్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆమె కాశ్మీర్‌కు వెళ్లివచ్చింది. ఇక్కడ తీసిన కొన్ని ఫోటోలను షోల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అవి వైరల్ అయ్యాయి.
పైగా, తనకు అంతకంతకూ ఫాలోయింగ్ పెరగడంతో రెమ్యునరేషన్‌కు ఒక్కసారిగా పెంచేసింది. ఈ విషయం తెలిసిన బుల్లితెర మరియు వెండితెర నిర్మాతలు షాక్‌కు గురైయ్యారు. అయితే, అనసూయ చేస్తున్న కార్యక్రమాలు అన్ని తెలుగు ప్రేక్షకులను ఆలరిస్తుండటంతో ఆమె డిమాండ్‌కు నిర్మాతలు తలొగ్గుతున్నారట. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం ఇదేనేమో.