బాలీవుడ్ నటి దిశా పటానీ కీలక నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ కండల వీరుడ సల్మాన్ ఖాన్ సరసన ఇకపై నటించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. సల్మాన్ – కత్రినా కైఫ్ – దిశా పటానీ కాంబినేషన్‌లో భరత్ అనే చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఈ నెల 5వ తేదీన విడుదలకానుంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
నిజానికి సల్మాన్‌తో నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్లు క్యూకడుతుంటారు. కానీ, దిశా పటానీ మాత్రం కేవలం ఒక్క చిత్రంతో నటించి ఇకపై నటించబోనని తేల్చి చెప్పింది.
దిశా పటానీ ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియరావడంలేదు గానీ, ఆమె తీసుకున్న నిర్ణయంతో బాలీవుడ్ ప్రముఖులు ఒకింత షాక్‌కు గురయ్యారు.
తాను సల్మాన్ సరసన చిన్న పిల్లలా కనిపిస్తున్నానని అందుకే ఇకపై సల్మాన్‌తో సినిమా చేయనని తేల్చిచెప్పింది. ఇంతకీ అసలు నిజం అదేనంటారా… లేక వేరే ఏదైనా ఉందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.