ఫ్యాన్స్.. మిస్టర్ సి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే..

0
56

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన. ఈ దంపతుల పెళ్లి రోజును సౌతాఫ్రికాలో తాజాగా జరుపుకున్నారు. ఉపాసన చేసిన పనికి ప్రతి ఒక్కరూ ఖంగుతిన్నారు. భర్తను పక్కనబెట్టుకుని.. సింహం పిల్లలతో ఆడుకుంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా ఫ్యాన్స్ బిత్తరపోయారు.

తాజాగా రెండు సింహం పిల్లలతో కలిసి ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన షేర్ చేసింది. ఈ ఫోటో కింద ఓ క్యాప్షన్ పెట్టి.. ఫ్రెండ్స్.. ఇప్పటికైనా తెలిసిందా.. మిస్టర్ సి నన్నెందుకు పెళ్ళి చేసుకున్నారో? అంటూ పేర్కొంది. పైగా, సౌతాఫ్రికా పర్యటన తమకెన్నో పాఠాలు నేర్పిందన్నారు.

ప్రకృతిని, జంతువులను గౌరవించాలని చెప్పిందని, వాటిని కాపాడుకునేందుకు మనవంతు ఏదన్నా చేసే సమయం వచ్చిందని అన్నారు. వేరే చిన్న పనులే పెద్ద మార్పును తెస్తాయని ఉపాసన పేర్కొంది. తనకు సింహం పిల్లలను పట్టే ధైర్యం ఉన్నందునే మిస్టర్ సి ఏరికోరి తనను పెళ్ళి చేసుకున్నాడనే ఉపాసన ఫోటోల ద్వారా చెప్పకనే చెప్పింది.