బాహుబలి స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సాహో. ఈ చిత్రం మూవీ టీజర్ మరికొద్ది రోజుల్లోనే మన ముందుకు రానుంది. ఈ టీజర్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో రాజీ పడటం లేదు. టీజర్‌లో ఒక చిన్న బిట్‌కి ఓ విదేశీ పాటని వాడాలనుకున్నాడు. ఆ పాటని కాపీ కొట్టడం ఇష్టం లేక, ఆ పాటకి భారీగా రాయల్టీ చెల్లించి టీజర్‌లో వాడుతున్నారు.
దర్శకుడు సుజిత్ కోరిక మేరకు చిన్న బిట్ కోసం 15 లక్షల రూపాయల రాయల్టీని చెల్లించారట. సినిమా క్వాలిటీ కోసం అంతగా ఖర్చు పెడుతోంది యూవీ క్రియేషన్స్ సంస్థ. ఈ సినిమా టీజర్‌ని ఈ నెల 5న విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. అయితే, అప్పటివరకు టీజర్ రెడీ అవుతుందా అనేది చూడాలి.
కాగా, సాహోను రూ.300 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తీశారు. ప్రతి షాట్‌ని మూడు వెర్సన్‌లలో చిత్రీకరించారట. మలయాళం భాషలో మాత్రం డబ్ చేయనున్నారు. ఇటీవల కన్నడంలోనూ డబ్ చేసుకునే వెసులుబాటు దొరికింది. ఈ మూవీని కన్నడంలో కూడా డబ్ చేస్తారా? లేక కర్ణాటకలో తెలుగు వెర్సన్‌ని రిలీజ్ చేస్తారా?
ప్రభాస్‌కి ఈ సినిమా ఆడటం ముఖ్యం. ‘బాహుబలి’ చిత్రాలు ప్రభాస్‌ని హిమాలయం అంత ఎత్తుకి తీసుకెళ్లాయి. ఆయన మార్కెట్ అంతే రేంజ్‌లో ఉండాలంటే బాహుబలియేతర సినిమాతో తన సత్తా చాటుకోవాలి. అందుకే ప్రభాస్ సాహోపై ఇంతగా ఖర్చు పెడుతున్నాడు.