ముద్దులు పెట్టకుండా నటించింది నేనొక్కదాన్నే : పూజితా

0
30

వెండితెరపై సందడి చేస్తున్న తెలుగు హీరోయిన్లలో పూజితా పొన్నాడ ఒకరు. ఈమె తాజాగా “సెవెన్” చిత్రంలో నటించింది. గతంలో “రంగస్థలం” చిత్రంలో కూడా నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే, తాజా చిత్రం ‘సెవెన్‌’ ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది.

ఇందులో ఈమె లిప్‌లాక్ సన్నివేశాల్లో హద్దులు దాటిందనే వార్తలు వచ్చాయి. వీటిపై పూజిత పొన్నాడ స్పందించింది. ఈ చిత్రం ఓ సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పాటలు కూడా మంచి ప్రజాధారణ పొందాయి. ఇదొక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్. కథలో కొన్ని ప్రశ్నలకు నా పాత్ర ద్వారా సమాధానం లభిస్తుంది.

అయితే, ఈ చిత్రంలో ముద్దు సీన్లు విపరీతంగా ఉన్నాయనీ, వాటిలో తాను రెచ్చిపోయినట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజంలేదు. నిజం చెప్పాలంటే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్లలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించని ఏకైక హీరోయిన్ తాను ఒక్కదాన్నే అంటూ చెప్పుకొచ్చింది. ఈ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీకి కూడా పరిచయం అవుతున్నట్టు తెలిపింది.

కాగా, సినీ ఇండస్ట్రీలో ఎవరి ప్రయాణం వాళ్ళది. ఒక హీరోయిన్ కెరీర్‌తో మ‌రో హీరోయిన్ కెరీర్‌ని కంపేర్ చేయ‌కూడ‌దు. నాకు మంచి అవకాశాలే వస్తున్నాయి. దర్శక, నిర్మాతలు తెలుగమ్మాయిలు కావాలని మరీ తీసుకుంటున్నారు. మా ఇంట్లో సినిమా నేపథ్యం ఉన్నవాళ్లు ఎవరూ లేరు. నటనపై ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేశా. ఇంట్లో అవి చూపిస్తే ఎంకరేజ్ చేశారని వివరించింది.