జయసుధకు కీలక పోస్ట్… సీఎం జగన్ చర్చలు

0
33

టాలీవుడ్ సీనియర్ నటి జయసుధకు కీలక పదవి వరించనుంది. గతంలో ఈమె కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ క్రమంలో భర్త నితిన్‌కపూర్ చనిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలో ఆమెకు అత్యంత కీలక పదవి దక్కనుందనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ (ఎఫ్.డి.సి) ఛైర్మన్ పదవికి టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ రాజీనామా చేశారు. ఆ పదవికి జయసుధకు రావొచ్చనే ప్రచారం సాగుతోంది.

సార్వత్రిక ఎన్నికలకు ముందు పలువురు సినీ తారలు వైకాపాలో చేరిన విషయం తెల్సిందే. వారిలో జయసుధ, అలీ, మోహన్ బాబు, పోసాని కృష్ణమురలి, జీవిత, డాక్టర్ రాజశేఖర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇపుడు ఏపీలో వైకాపా అధికారంలోకి రావడంతో తమకు ఏదైనా నామినేటెడ్ పదవి వరిస్తుందన్న ఆశతో వారంతా ఉన్నారు.

ముఖ్యంగా, ఎఫ్.డి.సి ఛైర్మన్ పదవికి సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు లేదా జయసుధ పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ సీనియర్ నటులు కావడంతో పాటు, అందరితో సత్‌సంబంధాలు ఉండటంతో సీఎం జగన్ వారి పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం.