హల్లో సార్.. ఎవరైనా వరుడుంటే చెప్పండి.. తెల్లపిల్ల

0
51
Tamanna Bhatia
Tamanna

తెలుగు చిత్ర పరిశ్రమలో మిల్కీబ్యూటీగా పేరుగాంచిన నటి తమన్నా. “అభినేత్రి-2” చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో ఆమెను ఓ అంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.

సరైన వ్యక్తి తారసపడితే ఇప్పటికిపుడు పెళ్లి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. కానీ, తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరకాలి కదా. పైగా, ఓ మంచి అబ్బాయిని చూసి పెట్టాలని దర్శకుడు ఏఎల్ విజయ్‌ (హీరోయిన్ అమలాపాల్ మాజీ భర్త)కు కూడా చెప్పాను. ఆయన కూడా అదే పనిలో ఉన్నారు. మీరు కూడా ఓ మంచి అబ్బాయిని చూసి పెడతారని ఆశిస్తున్నా అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.

కాగా, తమన్నా ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో చాలా బిజీగా గడుపుతోంది. “దటీజ్ మహాలక్ష్మి”, “ఖామోషి” చిత్రాల్లో నటిస్తూ క్షణం తీరిక లేకుండావుంది. అదేసమయంలో మంచి వరుడు దొరికితే మాత్రం పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చింది.