నాలుగు మాటలు చెబితే నిరుద్యోగం పోదు : మోడీపై శివసేన అటాక్

0
47

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యపై బీజేపీ మిత్రపక్షమైన శివసేన ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడింది. నాలుగు మాటలు చెప్పడం వల్ల, పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం వల్ల నిరుద్యోగ సమస్య పోదని విరుచుకుపడింది.

ఈ మేరకు తమ పార్టీ పత్రిక సామ్నాలో శివసేన ప్రత్యేక సంపాదకీయాన్ని ప్రచురించింది. నిరుద్యోగ యువతలో ధైర్యాన్ని నింపేందుకు నాలుగు మాటలు చెప్పడం వల్ల, ప్రకటనలు ఇవ్వడం వల్ల ఉద్యోగాల కల్పన జరగదని విరుచుకుపడింది. అంతేకాదు, బుల్లెట్ రైలు ప్రాజెక్టు కూడా ఉద్యోగావకాశాలను అందివ్వలేదని తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి కౌశల్య వికాశ్ యోజన పథకంపై ప్రశ్నల వర్షం కురిపించింది.

ప్రధానిగా నరేంద్ర మోడీ రెండోసారి ఎన్నికయ్యాక షేర్ మార్కెట్ ఉవ్వెత్తున ఎగసిందని, జీడీపీ వృద్ధి రేటు మాత్రం మందగించిందని విమర్శించింది. ఇక నిరుద్యోగం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని, నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతోందని, ఇది శుభపరిణామం కాదని హెచ్చరించింది.