బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యారాయ్.. తన గురువు దర్శకుడు మణిరత్నంపై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో అనేక చిత్రాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్ కాగా, మరికొన్ని చిత్రాలు బాక్సాఫీస్ బోల్తా పడ్డాయి.
ఈ నేపథ్యంలో తాజాగా మణిరత్నం దర్శకత్వంలో మరో చిత్రంలో నటించేందుకు ఐశ్వర్యారాయ్ సిద్ధమైంది. ఆ చిత్రం పేరు పొన్నియన్ సెల్వన్. ఈ చిత్రంలో ఆమె నెగెటివ్ రోల్ చేస్తోంది. ఇది మణిరత్నం డ్రీమ్‌ప్రాజెక్టు అని, రాజరాజ చోళులనాటి కథ అని వార్తలు చక్కర్లుకొడుతున్నాయి. ఈ సినిమాతోనైనా ఐష్ మళ్ళీ ఫాంలోకి వస్తుందేమో చూడాలి మరి.
నిజానికి ఐశ్వర్యారాయ్… దక్షిణాది, ఉత్తరాది అనే తేడాలేకుండా భారతీయులందరి మనసుల్ని దోచేసుకున్న విషయం తెల్సిందే. ఈ మాజీ ప్రపంచసుందరి పెళ్ళయ్యాక బిగ్ స్క్రీన్‌కు కాస్తంత విరామం ఇచ్చింది. ఆ తర్వాడు మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వక పోవడంతో ఇపుడు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను పోషించేందుకు సిద్ధమైంది.