జూనియర్ ఐశ్వర్యారాయ్గా తెలుగు ప్రేక్షకుల మనస్సును దోచుకున్న హీరోయిన్ స్నేహా ఉల్లాల్. తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, అలా మొదలైంది వంటి చిత్రాల్లో ఈ అమ్మడు నటించింది. ఈమె తెలుగులో నటించిన చిత్రం అంతా నీ మాయలోనే. 2014లో విడుదలైంది. ఆ తర్వాత ఎక్కడా కనిపించలేదు.
ఈ క్రమలో తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరిన ఫోటోలు షోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఆస్పత్రిలో ఎందుకు చేరిందబ్బా అని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. ఈ అమ్మడు ఆటో ఇమ్యూన్ డిస్ఆర్డర్ వ్యాధి సోకినట్టు తేలింది. ఈ వ్యాధితో బాధపడేవారు కనీసం 30 నిమిషాలు కూడా నిలబడలేరు. ఆ వ్యాధి రక్తానికి సంబంధించినది.
ఇదే అంశంపై ఆమె ట్విట్టర్ ఖాతాలో ఫోటోలను అప్లోడ్ చేసి తాను చికిత్స తీసుకుంటున్నట్టు వివరించింది. తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. జీవితంలో తొలిసారి ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. హై ఫీవర్ వలన చికిత్స కోసం హాస్పిటల్లో చేరాల్సి వచ్చింది. చాలా భయమేసింది. ఇప్పుడు ఆరోగ్యం కొంత మెరుగైంది. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం వలన కొద్దిగా త్వరగా కోలుకున్నాను. ప్రస్తుతం మంచిగానే ఇంట్లో ఉన్నాను అని స్నేహ తన ట్వీట్లో తెలిపింది.