రష్మిక మందన్నాకు అదృష్టమే అదృష్టం

0
47

కన్నడ భామ రష్మిక మందన్నా. బిగ్ స్క్రీన్‌పైకి ఏ ముహుర్తాన అడుగుపెట్టిందోగానీ, అదృష్టం మాత్రం ఆమె గందరగోళానికి గురయ్యే రేంజ్‌లో పట్టింది. నాగశౌర్య ‘ఛలో’ నుండి బిగిన్ అయితే గమనించే లోపు అల్లు అర్జున్, మహేష్ బాబు రేంజ్ స్టార్స్ పక్కన చాన్స్ కొట్టేసేవరకు ఎదిగిపోయింది.

అయితే ఇప్పుడు అదే క్రేజ్ రష్మిక మందన్నా ఇరకాటంలో పడేసింది. మహేష్ బాబు – అనిల్ రావిపూడి సినిమాలో హీరోయిన్‌గా ఫిక్సయింది. ఇంకా ఈ సినిమా సెట్స్‌పైకి రావాల్సి ఉంది. అయితే మరోపక్క ఇదే టైమ్ పీరియడ్‌లో సెట్స్‌పైకి రానున్న విజయ్ కొత్త సినిమాలోను రష్మికాకు ఆఫర్ వరించింది. దీంతో రష్మిక ఈ 2 ఆఫర్స్‌ని వదులుకోకుండా ఎలా మ్యానేజ్ చేయాలా..? అనే ఆలోచనలో పడింది.

పైగా, రష్మికకు ఇది తొలి తమిళ చిత్ర ఆఫర్. ప్రస్తుతం కార్తీ కొత్త సినిమాతో సెట్స్‌పై ఉంది. ఈ సినిమా తర్వాత వెంటనే రెండో చిత్రానికే విజయ్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక కోలీవుడ్‌లో కూడా రష్మికకి తిరుగుండదు. అలాగని ఇక్కడ మహేష్ బాబు సినిమాకి నో చెప్పగలదా..? అంత ఈజీ కాదు.