ఒక్క కన్నుగీటుతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన కుర్రపిల్ల ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆడార్ లవ్ అన మలయాళ చిత్రంలో ఈ అమ్మడు వెండితెరకు పరిచయమైంది. ఈ చిత్రం విడుదలకు ముందే ఈమెకు బోలెడంత ప్రచారం వచ్చింది. ముఖ్యంగా, ఒక్క కన్నుగీటు సన్నివేశం దేశ అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లింది.
అంతేనా.. ఒరు ఆడార్ లవ్ షూటింగ్‌లో ఉండగానే ఈమె ఎక్కడకు వెళ్లిన అభిమాన జనం క్యూ కట్టేవారు. ముఖ్యంగా, హైదరాబాద్‌కి వచ్చినపుడు హీరోలంతా ఆమెతో నటించేందుకు ఎగబడ్డారు. ఆమె నటించిన “లవర్స్ డే” సినిమా ఈవెంట్‌కి అల్లు అర్జున్ గెస్ట్‌గా వచ్చాడు. ఆమె బన్ని అభిమాని. ఆమె అందం చూసి… బన్ని ఆమెకి తన కొత్త సినిమాలో ఆఫర్ ఇచ్చాడని అప్పట్లో వార్తలు వచ్చాయి.
తీరా కట్‌చేస్తే.. ఇపుడు సీన్ మొత్తం మారింది. “లవర్స్ డే” దారుణంగా పరాజయం పాలైంది. ఆ సినిమా చూసిన వారికి అర్థమైంది ఏంటంటే ఆమెకి నయాపైసా యాక్టింగ్ రాదని. దాంతో ఆమె ఒప్పుకుంటే కోటి రూపాయల పారితోషికం కూడా ఇస్తామని ఎగబడ్డ మేకర్స్ అంతా ఇపుడు వెనక్కి తగ్గారు. ఆమెకి ఒక్క ఆఫర్ లేదిపుడు. తెలుగులోనే కాదు ఆమె మాతృభాష మలయాళంలోనూ ఇదే సీన్. ఒక్క కన్నుగీటు సీన్ ఎంత ప్రభంజనం సృష్టించిందబ్బా?!