కోలీవుడ్ నటి షమ్ము సంచలన ఆరోపణలు చేసింది. ఓ దర్శకుడు నేరుగా పడక సుఖం ఇవ్వాలని అడిగాడని చెప్పుకొచ్చింది. అయితే, ఈ దర్శకుడు పేరును మాత్రం ఆమె బయటకు వెల్లడించలేదు. కానీ, ఆయన దర్శకత్వం వహించే చిత్రంలో హీరో మాత్రం విజయ్ దేవరకొండ అని చెప్పింది. దీనిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయింది.
తమిళ యువ హీరో శివ కార్తికేయన్ చిత్రం “మిస్టర్ లోకల్”. ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన కోలీవుడ్ నటి షమ్ము. ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో చిట్‌చాట్ చేసింది. నెటిజన్లు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానమిస్తూ తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అంశాన్ని లీక్ చేసింది.
తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని, అయితే వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు కాబట్టి ఫిర్యాదు చేయనన్నారు. ఒకవేళ ఫిర్యాదు చేసినా ఉపయోగం లేదని, ఎదుటి వ్యక్తి తన తప్పును ఒప్పుకోడని పేర్కొన్నారు.
కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ దర్శకుడు తన కోరిక తీరిస్తే, తాను విజయ్ దేవరకొండతో తెరకెక్కించబోయే సినిమాలో అవకాశం ఇస్తానని పబ్లిక్‌గా చెప్పాడనీ వెల్లడించింది. కానీ, ఆ దర్శకుడి పేరును మాత్రం వెల్లడించనని తెలిపింది.