ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్‌పై శ్రీలంక జట్టు అలవోక విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో విండీస్ చేతిలో ఘోర పరాజయం చవి చూసిన శ్రీలంక తన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మంగళవారం కార్డిఫ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక.. మహ్మద్ నబి (4/30), రషీద్‌ఖాన్ (2/17) కట్టుదిట్టమైన బౌలింగ్‌కు 36.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (78; 81 బంతుల్లో 8×4) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక వర్షం కారణంగా కుదించిన లక్ష్యాన్ని(41 ఓవర్లలో 187) ఛేదించడంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్.. నువాన్ ప్రదీప్ (4/31), మలింగ (3/39) దెబ్బకు 32.4 ఓవర్లలో 152 పరుగులకే ఆలౌటైంది. నజిబుల్లా (43; 56 బంతుల్లో 6×4) ఒంటరి పోరాటం చేసిన జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయాడు.