రూ.100 కోట్ల బడ్జెట్‌తో జయలలిత బయోపిక్

0
43

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రను పోషించనుంది. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లతో తెరకెక్కించే పనిలో దర్శక నిర్మాతలు నిమగ్నమయ్యార. ఈ చిత్రానికి ఏఎల్. విజయ్ దర్శకత్వం వహించనున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా, ముఖ్యమంత్రిగాను జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు ఉంటాయి. కథానాయికగా మారిన దగ్గర నుంచి ఆమె జీవితం ఎంతో విలాసవంతంగా గడిచింది. ఆ విలాసవంతమైన జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి పెద్ద మొత్తంలోనే ఖర్చు అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.

పైగా, కంగనా రనౌత్‌కి గల క్రేజ్‌ను… జయలలిత పట్ల ప్రజలకి గల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు. అందువల్ల రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టినా టెన్షన్ పడవలసిన అవసరం లేదని నిర్మాతలు భావిస్తున్నారట.