శృతిహాసన్‌పై కన్నుపడిన కొరటాల..

0
58

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్‌లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం ఆగస్టు 22వ తేదీ నుంచి లాంఛనంగా ప్రారంభంకానుంది. ఇప్పటికి కథ, స్క్రిప్టును సిద్ధం చేసిన దర్శకుడు కొరటాల… హీరోయిన్ల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. వీరిలో ఒకరు అనుష్క కాగా మరొకరి పేరు ఖరారు కావాల్సివుంది.

ఈ క్రమంలో శృతిహాసన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో కొరటాల సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ అయిన తర్వాత శ్రుతి హాసన్ మళ్లీ సినిమా అవకాశాల కోసం చూస్తోంది. ఇందుకోసం కాస్త స్లిమ్‌గా కూడా తయారవుతోంది. ఈ విషయం తెలిసే కొరటాల ఆమెతో సంప్రదింపులు మొదలెట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. శ్రుతిహాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే చిరంజీవి సరసన నటించే రెండో హీరోయిన్ పేరు ఖారరైనట్టే.