ఎక్కడైనా విజయం మాదే : కేటీఆర్

0
49

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస విజయభేరీ మోగించింది. దీనిపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పదించారు. ఇది చారిత్రక, అసాధారణ విజయం అని అభివర్ణించారు.

పార్టీ ఆవిర్భవించిన 2001లోనే టీఆర్ఎస్ పరిషత్ ఎన్నికలు ఎదుర్కొందని, అప్పుడు కరీంనగర్, నిజామాబాద్ జడ్పీ పీఠాలు చేజిక్కించుకుని సత్తా చాటిందని వివరించారు. అప్పటినుంచి ఇది ఐదో స్థానిక ఎన్నికల క్రతువు అని, అయితే ఈసారి మాత్రం టీఆర్ఎస్ ఎన్నడూలేనంతగా ఘనవిజయం సాధించిందని చెప్పారు.

నూటికి నూరు శాతం జిల్లాలు కైవసం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదని, తమపై ఈస్థాయిలో ఆదరాభిమానాలు చూపించిన ప్రజలకు రుణపడి ఉంటామని కేటీఆర్ తెలిపారు.

ఈ ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన గులాబీ సైనికులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పారు. ఎన్నిక ఏదైనా సరే, అది బ్యాలెట్ ద్వారా అయినా సరే ఈవీఎం ద్వారా అయినా సరే కేసీఆరే మా నాయకుడు అంటూ మిగతా పార్టీలను ప్రజలు తిప్పికొట్టారు అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.