కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈయన తీసిన చిత్రం కేజీఎఫ్. కర్ణాటక – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లో సాగుతున్న మైనింగ్ మాఫియా ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో యువ హీరో యష్ నటించగా, ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుని కనకవర్షం కుర్పించింది. దీంతో కేజీఎఫ్ సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందట. వీరిద్దరి కాంబినేషన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. జూనియర్ ఎన్టీఆర్‌తో ఈ సంస్థ ఇప్పటికే “జనతా గ్యారేజ్” వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని నిర్మించింది.
ఇపుడు కేజీఎఫ్ దర్శకుడుతో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తోందట. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీని చేస్తున్నాడు. ఈ చిత్రం 2020 మే నెలకుగాను పూర్తికాద. ఆ తర్వాతే కేజీఎఫ్ దర్శకుడుతో ఎన్టీఆర్ మూవీ ఉండే అవకాశం ఉంది. ఈ లోపు కేసీఎఫ్ సీక్వెల్‌ను పూర్తి చేయాలన్న పట్టుదలతో ప్రశాంత్ నీల్ ఉన్నట్టు సమాచారం.