చలికాలంలో ‘సైజు’ ఎందుకు కుంచించుకుపోతుంది?

0
60

అనేక మంది యువకులకు అంగం సైజులో తేడాలు ఉంటాయి. అంగం సైజు చిన్నదిగా, పెద్దదిగా ఉంటుంది. కొందరికి 3 అంగుళాల పొడవు ఉంటే.. మరికొందరికి గరిష్టంగా 6 అంగుళాల పొడవు ఉంటుంది. అంగం పొడవు ఎంత ఉన్నప్పటికీ.. శృంగారంలో మాత్రం వారు పొందే తృప్తిమాత్రం ఒక్కటే.

అదేసమయంలో అంగం స్తంభించకుండా ఉన్నపుడు అంగం సైజు తగ్గిపోతుంది. స్తంభించినప్పుడు అంగం 5 అంగుళాల పరిమాణం ఉన్నా, మామూలు స్థితిలో చూస్తే, పొడవు తగ్గినట్టు స్పష్టంగా కనిపించడంతో కంగారు మొదలైంది. అలాగే, చలికాలంలో కూడా అంగం సైజు తగ్గిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుందున్న అంశంపై సెక్స్ వైద్య నిపుణులను సంప్రదిస్తే,

అంగస్తంభనాలు, స్తంభించినప్పుడు అంగ పరిమాణంలో తేడాలు లేకుంటే ఎలాంటి సమస్య లేనట్టుగానే భావించాలి. అంగం కుంచించుకుపోవడం అనేది సర్వసాధారణం. ముఖ్యంగా చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల అంగం కొంత కుంచించుకుపోయినట్టు కనిపించడం సహజం. చల్లని వాతావరణానికి అంగంలోని స్పాంజ్‌ లాంటి కణజాలం కుంచించుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఇది సహజం. ఈ తేడాను కొత్తగా గమనించి కంగారు పడాల్సిన అవసరంలేదు.

ఇక లైంగిక కోరిక కలిగినప్పుడు అంగం స్తంభిస్తున్నా, స్తంభించిన పురుషాంగం కనీసం మూడున్నర అంగుళాల మేర పెరుగుతున్నా కంగారు పడవలసిన పని లేదు. అంగంతోపాటు, వృషణాలు కూడా చల్లని వాతావరణానికి కుంచించుకుపోవడం అత్యంత సహజం. కాబట్టి ఈ మార్పులకు భయపడకూడదు.