అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. గతంలో “జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి” చిత్రాలు రాగా, అవి సూపర్ డూపర్ హిట్ కొట్టాయి. ఈ క్రమలో మూడో చిత్రం వీరిద్దరి కాంబినేషన్‌లో రానుంది.
ఈ చిత్రం ఇప్పటికే తొలి షెడ్యూల్ షూటింగును పూర్తి చేసుకుంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగు జరుపుకుంటోంది. కథా పరంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరమట. ప్రధాన కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు.
ఇక రెండో హీరోయిన్‌గా ఎవరిని తీసుకుంటారా అనే దానిపై ఇప్పటివరకు సస్పెన్స్ కొనసాగుతూ వచ్చింది. కానీ, అల్లు అర్జున కోసం నివేదా పేతురాజ్‌ను త్రివిక్రమ్ ఎంపిక చేశారట. వీరిద్దరికీ జోడీ బాగావుంటుందని భావించిన త్రివిక్రమ్.. నివేదాకు ఓటు వేశారట.
తాజా షెడ్యూల్ షూటింగులో ఆమె పాల్గొంది. సాయిధరమ్ తేజ్ జోడీగా ‘చిత్రలహరి’ సినిమా ద్వారా నివేదా పేతురాజ్ తెలుగు తెరకి పరిచయమైన విషయం తెల్సిందే. రెండో సినిమాతోనే ఆమె త్రివిక్రమ్ – బన్నీ కాంబినేషన్లో అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.