రజినీకాంత్‌కు మాటలేకానీ చేతలు లేవు : స్వామి సెటైర్లు

0
41

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీ స్థాపించే విషయంలో రజినీ మాటలే కానీ, చేతలు లేవన్నారు.

ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మాటలు తప్ప రజనీకాంత్‌లో చేతలు కనిపించడంలేదని, కొత్త పార్టీ పెట్టే విషయంలో ఎలాంటి స్పష్టతలేదని దుయ్యబట్టారు. బీజేపీ సిద్ధాంతాలు బాగున్నాయంటున్న రజనీకాంత్, తన రాజకీయ రంగప్రవేశంపై ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.

కాగా, రజనీకాంత్ కొత్త పార్టీ పెడతారంటూ ఆయన సోదరుడు సత్యనారాయణరావు గతంలో వెల్లడించారు. ఈ ప్రకటనను ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతించారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీ ప్రకటన ఉంటుందని అందరూ భావించారు. కానీ, రజనీకాంత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి.