డిగ్రీలో మంచి మార్కులతో ఉత్తీర్ణులైన జగన్..

0
68

నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తన మంత్రివర్గాన్ని 25 మందితో కలిసి శనివారం విస్తరించారు. ఈ నేపథ్యంలో జగన్ విద్యార్హతకు సంబంధించిన విషయం ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

జగన్ విద్యాభ్యాసం మొత్తం దాదాపు హైదరాబాద్‌లోనే సాగింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బేగంపేట్‌లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో పూర్తి చేశారు. ఆ తర్వాత డిగ్రీని ప్రగతి మహావిద్యాలయలో చదివారు.

ఈ క్రమంలో జగన్ డిగ్రీ మార్కుల జాబితా ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఆయన ఇంగ్లీష్, సంస్కృతం, బిజినెస్ ఎకనామిక్స్, అకౌంటెన్సీ, కరెన్సీ అండ్ బ్యాంకింగ్, ఇండియన్ ఎకానమీ, కంపెనీ లా ఆడిట్, కాస్ట్ అకౌంటెన్సీ, బిజినెస్ స్టాటిస్టిక్స్ తదితర సబ్జెక్టులతో బీకాం చదివినట్టుగా తెలుస్తోంది. మొత్తమ్మీద జగన్ డిగ్రీలో మంచి మార్కులతోనే పాసయ్యారు.