“రాక్షసన్” చిత్రం ద్వారా వెండితెరపై హీరోగా మెరిచిన కుర్రోడు విష్ణు. ఈయన వివాహమై భార్యకూడా ఉంది. కానీ, భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం హీరో విష్ణు ఒంటరిగా ఉంటూ, హీరోగా నటిస్తున్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం “జగజ్జాల కిలాడి”. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.
ఇదిలావుంటే, హీరో విష్ణు ఓ క్రీడాకారిణితో తిరుగుతున్నాడు. ఆమె ఎవరో కాదు. జ్వాలా గుత్తా. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. గత కొన్ని నెలలుగా ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో వీరిద్దరి గురించి అనేక కథనాలు రావడం మొదలయ్యాయి.
దీనిపై విష్ణు స్పందిస్తూ, ప్రస్తుతానికి బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల తాను మంచి స్నేహితులం మాత్రమేనని, ఈ స్నేహం తదుపరి దశకు వెళ్తుందా? అని తనను అడిగితే సమాధానం చెప్పలేనని చెప్పుకొచ్చాడు.
దాదాపు ఏడాదిన్నరగా ఆమె తనకు తెలుసునని, ఇద్దరికీ కామన్‌గా ఉన్న స్నేహితులతో కలిసి టైమ్ పాస్ చేస్తుంటామని అన్నాడు. ప్రస్తుతం ఇద్దరమూ ఎవరి పనుల్లో వాళ్లం బిజీగా ఉన్నట్టు చెప్పాడు.
పైగా, ఇటీవల గుత్తా జ్వాలతో సన్నిహితంగా తీసుకున్న సెల్ఫీలను విష్ణు, తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో, అవి వైరల్ అయ్యాయి. వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి.