దేశ ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఆయన తన మాల్దీవుల పర్యటనను ముగించుకుని నేరుగా శ్రీలంకకు వెళ్లారు. అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ఆదివారం సాయంత్రానికి రేణిగుంటకు చేరుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో పాటు.. సీఎం. జగన్ మోహన్ రెడ్డిలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. భారత వాయు సేనకు చెందిన ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. తర్వాత మోడీ విమానం నుంచి కిందికి రాగానే ఆయనకు పుష్పగుచ్ఛం అందించి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించారు. అయితే మోడీ వద్దని వారించారు.
మర్యాదపూర్వక పలకరింపుల సందర్భంగా హడావుడిగా మరోసారి మోడీకి పాదాభివందనం చేసేందుకు జగన్ విఫలయత్నం చేశారు. జగన్‌ను కాళ్లకు నమస్కారం చేయనివ్వకుండానే మోడీ ముందుకు లాగి హత్తుకున్నారు. ఆ తర్వాత ముందుకు కదిలారు. దాంతో, జగన్ చేసేది లేక నవ్వుతూ తన పార్టీ ముఖ్యనేతలను ప్రధానికి పరిచయం చేస్తూ స్వాగత కార్యక్రమాన్ని పూర్తి చేశారు.