యువత నిద్రలేమికి కారణమేంటి?

0
48

చాలా మంది యువత నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. దీనికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మానసిక ఒత్తిడితో పాటు.. చదువు టెన్షన్ వారిని వేధిస్తూ ఉంటుంది. అయితే, యువకులకు రాత్రుళ్లు సరిగా నిద్రపట్టకపోవడానికి కారణం మత్తుపానీయాల సేవనమని అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ తెలిపింది.

మద్యం సేవించిన కారణంగా యువకులు తొందరగా నిద్రపోలేకపోతున్నారని ఆ పరిశోధన సంస్థ వెల్లడించింది. యువకులను బయటకు చెప్పుకోలేని సమస్యలు వేధిస్తున్నాయని, వాటి కారణంగా విపరీతంగా ఆలోచిస్తూ కొంతమంది నిద్రకు దూరమైతే, మరికొందరు మద్యానికి బానిసలువుతున్నారని ఆ పరిశోధనతో వెల్లడైంది.

ఈ విషయంపై పరిశోధకులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని కోరుతున్నారు. పాఠశాల స్థాయిలోనే యువకులు మద్యానికి బానిసలుగా మారుతుండడం ఆందోళన కలిగిస్తోందని, వారిని అదుపు చేయాల్సిన అవసరం ఉందని ఆ పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధన ప్రస్తుతానికి అమెరికాకు పరిమితమైనా, పొరుగింటి పుల్లకూరను పిచ్చిగా అనుసరించే మనయువతను కూడా భవిష్యత్‌లో ఈ ప్రమాదం ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.