ప్రియా మోహన్‌పై మనసుపడిన కుర్ర హీరోలు

0
51

తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్లలో ప్రియా మోహన్ ఒకరు. ఈమె తన అందంతో కుర్రకారు హీరోలను మెస్మరైజ్ చేస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెను బుక్ చేసుకునేందుకు పోటీపడుతున్నారు.

తమతమ కొత్త చిత్రాల్లో ప్రియా మోహన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శక నిర్మాతలపై ఒత్తిడి చేస్తున్నారట. ప్రియా మోహన్ యువ హీరోలను అంతగా ఆకర్షించిందట.

ప్రస్తుతం ఈమె విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఈ చిత్రంలో నాని సరసన నటిస్తోంది. అయినప్పటికీ దర్శకుడు మాత్రం ఈ అమ్మడు ఫోటోను ఎక్కడా కూడా లీక్ చేయలేదు.

అయినప్పటికీ ఈ అమ్మాయి అందం గురించి తెలుసుకున్న కుర్ర హీరోలు మాత్రం ఆమెను బుక్ చేసుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారట. ఎవరికి వారుగా తమ ప్రయత్నాలను కూడా మొదలుపెట్టేశారన్నది టాలీవుడ్ వర్గాల సమాచారం.

అయితే తన సినిమా పూర్తయ్యేంత వరకూ మరో ప్రాజెక్టును చేయడానికి వీల్లేదని విక్రమ్ కుమార్ షరతు పెట్టడంతో ఆ అమ్మాయి మరో ప్రాజెక్టుకు సంతకం చేసే పరిస్థితి లేదు. సో… ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ పూర్తయితేగానీ, ఈ సుందరిని పట్టుకోలేమని, అంతవరకు ఎవరికీ చిక్కకపోవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి.