బిగ్ బాస్-3 హోస్ట్‌గా రేణూ దేశాయ్

0
53

ప్రముఖ రియాల్టీ షో బిగ్ బాస్ మూడో సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణూ దేశాయ్ పార్టిసిపెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఈ షోపై రేణూ దేశాయ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను బిగ్‌బాస్‌లో పాల్గొనడంలేదని స్పష్టం చేశారు. అయితే బిగ్‌బాస్‌ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించాలని అనుకుంటున్నానని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారా అని అడుగుతూ ఎన్నో మెసేజ్‌లు వస్తున్నాయి. తాను ఈ షోలో పాల్గొనడం లేదని.. అయితే బిగ్ బాస్ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా చేస్తానని చెప్పారు. అలాగే బిగ్ బాస్ సూపర్ హిట్ షోలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే.. తనలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశం లభిస్తుందని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.