బుమ్రాతో ప్రేమలో వున్న అనుపమ పరమేశ్వరన్?

0
51

ప్రేమమ్ చిత్రంతో కుర్రహృదయాలను కొల్లగొట్టిన అనుపమ.. అఆ, శతమానం భవతి, కృష్ణార్జున యుద్ధం, తేజ్ ఐ లవ్ యు తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన సంగతి తెలిసిందే. తాజాగా అనుపమకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అదేంటంటే.. భారత యువ ఫాస్ట్ బౌలర్ బుమ్రా దక్షిణాది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో డేటింగ్‌లో వున్నట్లు సోషల్ మీడియా గుప్పుమంటున్నాయి. ఇందుకు కారణం బుమ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఫాలో అవుతున్న సెలబ్రిటీల్లో లేడీ సెలబ్రిటీ అనుపమ ఒక్కటే ఉండటం ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది. అనుపమ ఇన్‌స్టాగ్రామ్‌ని బూమ్రా ఫాలో కావడంతో పాటు.. ఒకరి పోస్ట్‌లను ఒకరు షేర్ చేసుకుని లైక్స్ చేస్తుండటంతో ఇద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ నడుస్తుందంటూ ప్రచారం ఊపందుకుంది.

అయితే ఈ వార్తలపై స్పందించిన అనుపమ.. ప్రేమ లేదని అంటోది. ఇలాంటి వదంతులను ఎలా పుట్టిస్తారో అర్థం కాదు. బూమ్రా తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని అనుపమ క్లారిటీ ఇచ్చింది. గతంలో రాశిఖన్నా కూడా బూమ్రా ప్రేమలో ఉందంటూ పుకార్లు షికారు చేసిన విషయం తెలిసిందే.