పెళ్లి చేసుకోను.. ఎందుకో తెలుసా? సాయిపల్లవి

0
49

ప్రేమమ్‌లో మలర్ పాత్రలో కనిపించిన సాయిపల్లవి ఇటీవల సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకేలో సూర్యతో జతకట్టింది. ఈ నేపథ్యంలో పెళ్లి గురించి సాయిపల్లవి స్పందించింది. ”నేను పెళ్లి చేసుకోను” అంటూ బదులిచ్చింది. ఇందుకు కారణం కూడా చెప్పింది. తాను వివాహం చేసుకుంటే తన తల్లిదండ్రులను చూసుకునే అవకాశం వుండదని.. అందుచేత ఎప్పటికీ వివాహం అంటూ చేసుకోనని స్పష్టం చేసింది సాయిపల్లవి.

గతంలో సహజీవనానికి తాను వ్యతిరేకం కాదని క్లారిటీ ఇచ్చింది సాయిపల్లవి. గతంలో మీరు ఎవరితోనైనా కలిసి ఉన్నారా.. ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది సాయిపల్లవి.

ప్రేమలో ఉన్నాను కానీ ఇప్పుడు సినిమాతో మాత్రమే ప్రేమలో ఉన్నాను అని చెప్పింది సాయిపల్లవి. తాను సహజీవనం చేయట్లేదని.. తనకు అలాంటివి ఇష్టముండదని చెప్పింది పల్లవి. అంతమాత్రాన లివ్ ఇన్ రిలేషన్ షిప్‌కు వ్యతిరేకం కాదని చెప్పింది ఈ ముద్దుగుమ్మ.