గుమ్మడి జ్యూస్‌తో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

0
65

జ్యూస్‌లో కొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌గా చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇది చర్మంను టైట్ చేస్తుంది. ముడుతలను నివారిస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్ చేస్తుంది. గుమ్మడి జ్యూస్‌లో క్యాల్షియం, ప్రోటీన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది చర్మంలో మచ్చలను, పిగ్మెంటేషన్ ఇతర సమస్యలను నివారిస్తుంది. చర్మంను తేలికపరిచి మచ్చలు లేకుండా చేస్తుంది. గుమ్మడి జ్యూస్‌లో కొద్దిగా తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలాచేస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే ఏవైనా కీటకాలు కుట్టినా గుమ్మడి మంటను నివారిస్తుంది. కాలిన గాయాలను మాన్పుతుంది. ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. గుమ్మడిలో ఉండే జింక్, విటమిన్ సి గాయాలను మాన్పుతుంది . గాయాలైన ప్రదేశంలో గుమ్మడి జ్యూస్‌ను అప్లై చేయాలని బ్యూటీషన్లు అంటున్నారు.