రేపటి టీమిండియా మ్యాచ్‌కు వరుణుడి అడ్డంకి లేదు
మాంచెస్టర్: మాంచెస్టర్‌లో గురువారం జరగనున్న భారత్xవెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణం పొడిగా ఉందని, వర్షం పడటానికి అవకాశం లేదని పేర్కొంది. ప్రస్తుత ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లు ఇప్పటికే వర్షార్పణమయ్యాయి. అయితే ఈ పోరు వెస్టిండీస్‌కు ఎంతో కీలకం కానుంది. సెమీస్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ కరీబియన్లు తప్పక గెలవాల్సిందే. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాత్‌వైట్ ఒంటరిగా పోరాడినా జట్టుని విజయతీరాలకు చేర్చలేకపోయాడు. మరోవైపు భారత్ వరుస విజయాలతో దూసుకెళ్తుంది. సెమీస్ బెర్తును ఖరారు చేసుకునేందుకు కోహ్లీ సేన ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో విండీస్ మూడు పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉండగా, భారత్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.