
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సినీ నటి సమంత, దర్శకురాలు నందినీరెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఎదుటకు వచ్చిన సమంతను చూడటానికి భక్తులు పోటీ పడ్డారు. నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘ఓ బేబి’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.