నువ్వాడుతున్నది నాతో కాదు యముడితో..

0
76

విక్రమ్‌.. ‘మిస్టర్‌ కేకే’ టీజర్‌ చూశారా..!

చెన్నై: ప్రముఖ నటుడు చియాన్‌ విక్రమ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కడరం కొండాన్’. తెలుగులో ‘మిస్టర్‌ కేకే’గా విడుదల కాబోతోంది. ఈ చిత్ర తెలుగు టీజర్‌ విడుదలైంది. అక్షరా హాసన్‌ కథానాయిక. నాజర్‌ కుమారుడు అబీ హస్సన్‌ ఇందులో అక్షర భర్త పాత్రలో నటించారు. కేకే పేరుతో విక్రమ్‌ అందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తూ వారిని చంపేస్తుంటాడు. అలా ఎందుకు చేస్తున్నాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో విక్రమ్‌ కొత్త లుక్‌లో ఆకట్టుకుంటున్నారు. టీజర్‌లో విక్రమ్‌ ఒకరిని బెదిరిస్తూ.. ‘నువ్వు ఆడుతున్నది నాతో కాదు యముడితో’ అని చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. చివర్లో.. ‘నా గురించి తెలియాలంటే ఇంకొంతసేపు వేచి ఉండాలి’ అన్న డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థపై కమల్‌ హాసన్‌ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాజేశ్‌ సెల్వా దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.