బడ్జెట్ మొత్తం రూ. 27,86,349 కోట్లు
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
గ్రామాలపై ప్రత్యేక దృష్టి
రైతుకు మరింత మద్దతు
పదేళ్ల దార్శనికత ఆవిష్కరణ
విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం
కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఐదు లక్షల కోట్ల డాలర్ల భారీ స్వప్నం!
సార్వత్రిక ఎన్నికల్లో జన భారతం పట్టిన బ్రహ్మరథం స్ఫూర్తితో మోదీ సర్కారు.. నవ భారత ఆవిష్కారం కోసం బడ్జెట్ వేదికగా లక్ష్యించిన భారీ ఆర్థిక యజ్ఞం ఇది!
అత్యంత కీలకమైన ఆర్థిక శాఖ పగ్గాలు చేపట్టిన మహిళ.. దేశ ఆర్థికరంగ బలోపేతానికి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారన్న సర్వత్రా ఆసక్తి నడుమ… నిర్మలా సీతారామన్ ‘దిగ్గజ భారత’ నిర్మాణమే తమ దృఢతర ధ్యేయమని తేల్చి చెప్పారు. అందుకోసం ప్రణాళికా రచనకే పెద్దపీట వేశారు. ఎక్కడా పెద్దగా ఊరడింపులూ, ఉదార కేటాయింపులూ లేకుండా గట్టి క్రమశిక్షణే పాటించారు. కొనసాగుతున్న పథకాలకు బాసటనివ్వటంతో పాటు కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులకు స్వాగతం పలికారు. భారీ కార్పొరేట్లకు ప్రోత్సాహకంగా పన్ను కొంత తగ్గించారు. ఆదాయ పన్నును ముట్టుకోలేదు. మొత్తానికి ఈ బడ్జెట్లో అంకెలకన్నా ఆలోచనలు.. భూరి గణాంకాల కన్నా భారీ ప్రణాళికలే ఎక్కువన్నది సుస్పష్టం. అలాగే పెట్రో వాతతో సామాన్యుడి నుంచీ.. బంగారం మోతతో మధ్యతరగతి నుంచీ.. కోటిపైన లావాదేవీలపై పన్నుతో సంపన్నుల నుంచీ.. నిర్మలమ్మ నిమ్మళంగా బాగానే గుంజారన్నది నిష్ఠుర సత్యం!
దేశ భద్రత, ఆర్థిక వృద్ధి అనే రెండు కీలక లక్ష్యాల కోసం ప్రజలు మాకు భారీ మద్దతిచ్చారు. ఆ స్ఫూర్తితో నవభారత నిర్మాణం కోసం అడుగులు వేస్తున్నాం
– నిర్మలా సీతారామన్ |
ఈ బడ్జెట్ 21వ శతాబ్దంలో భారత ప్రగతిరథాన్ని పరుగులు తీయిస్తుంది. పేదలను శక్తిమంతులను చేస్తుంది. దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది. దేశంలో మౌలిక వసతుల ఆధునికీకరణకు దోహదపడుతుంది. జనహితమైన ఈ బడ్జెట్ ప్రజలందరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
– ప్రధాని మోదీ |
బడ్జెట్ నిస్సారంగా ఉంది. సమాజంలో ఏ వర్గానికీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆశించిన ఉపశమనాన్ని కల్పించలేక పోయారు.
– పి.చిదంబరం, కాంగ్రెస్ నేత |
ప్రధానాంశాలు
* ఆదాయపు పన్ను శ్లాబులు యథాతథం |