‘కొత్త తరహా సినిమా రావాలంటే అవాంతరాలు ఉంటాయి. వాటిని దాటుకుని నిలబడడం కష్టం. అలా నిలబడిన సినిమా ‘ఓ బేబీ’. ఇలాంటి విజయాలు రాబోయే చిత్రాలకు స్ఫూర్తినిస్తాయ’’న్నారు రానా. సమంత ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘ఓ బేబీ’. నందినిరెడ్డి దర్శకురాలు. సురేష్‌బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యూన్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. రానా మాట్లాడుత ‘‘సమంతకు మంచి సినిమాల్లో నటించాలనే పిచ్చి. తన పిచ్చికి ఈ సినిమాతో ఓ చిరునామా దొరికింది. సురేష్ ప్రొడక్షన్స్‌లో తను ఇక ఎన్ని సినిమాలైనా చేసుకోవచ్చు. అందరి హృదయానికీ హత్తుకున్న చిత్రమిది. కొరియన్ కథని తెలుగు సినిమాలా మార్చిన నందినికి హ్యాట్సాఫ్’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. దానికి మించిన ప్రతిఫలం లభించింది. ఇక మీదట మరిన్ని మంచి కథలతో, మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్రయత్నిస్తా’’ అంది సమంత. ‘‘ఈ జన్మకు ఇదే గొప్ప అనుభూతిలా అనిపిస్తోంది. ప్రేక్షకుల స్పందన చూస్తే కళ్లు చమరుస్తున్నాయి’’ అన్నారు నందిని రెడ్డి. ‘‘సమంత లక్ష్మి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశార’’న్నారు మాటల రచయిత లక్ష్మీభూపాల్. ‘‘ఈ చిత్రంలో అన్నిరకాల భావోద్వేగాలూ ఉన్నందుకే ప్రేక్షకులు ఆదరిస్తున్నార’’న్నారు వివేక్ కూచిభొట్ల.కార్యక్రమంలో తేజ, సునీత తదితరులు పాల్గొన్నారు.
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -