హైదరాబాద్: తెరాస సీనియర్ నేత, తెలంగాణ ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని ఈ సందర్భంగా ప్రకటించారు. సత్యనారాయణతోపాటు మాజీ కార్పొరేటర్లు పలువురు పార్టీకి రాజీనామా లేఖలు సమర్పించారు. రామగుండం నియోజవర్గం నుంచి గత శాసనసభ ఎన్నికల్లో సత్యనారాయణ పరాజయం చవిచూశారు.అప్పటినుంచి పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్యనారాయణ తన అనుచరులతో కలిసి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను అడగకుండానే సీఎం గతంలో నాకు ఆర్టీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారన్నారు. కానీ, ప్రస్తుతం తెరాసలో క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. కనీసం పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. గత ఎన్నికల్లో తన ఓటమికి మాజీ ఎంపీ, ముఖ్య నాయకులే కారణమని దుయ్యబట్టారు
Latest article
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై
ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణానికి విచ్చేసిన ఆమెకు (గవర్నర్) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,...
వసుధ టీవీ ఆధ్వర్యంలో హోరెత్తిన బతుకమ్మ సంబరాలు..
నవ్య ల్యాండ్ మార్క్ ఘనంగా బతుకమ్మ సంబరాలుభారీ సంఖ్యలో హాజరైన మహిళలుబతుకమ్మ పాటలతో హోరెత్తిననవ్య ల్యాండ్ మార్క్అమీన్పూర్ మున్సిపాలిటి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పటాన్చెరు నియోజక...
తొలి మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ విజయవంతం
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో మొదటి రోజు మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.
- Advertisement -