అవంతిక ఎవరు? ‘మన్మథుడు’తో తనకున్న అనుబంధం ఏంటి?

0
52

ఆ అమ్మాయి పేరు అవంతిక. ఇంట్లో చాలా పద్ధతిగా ఉంటుంది. చల్లగాలిలా హాయిగా మాట్లాడుతుంది. పెద్దవాళ్లంటే అమితమైన గౌరవం. ఇక భక్తికి కొదవ లేదు. ఇదంతా ఇంటి వరకే. బయటకు వస్తే మాత్రం ఆ చల్లగాలి కాస్తా తుపానుగా మారిపోతుంది. అగరొత్తులు వెలిగించిన అమ్మాయి.. సిగరెట్టు ముట్టించి గుప్పు గుప్పుమంటుంది. చూడ్డానికి ‘యూ’ సర్టిఫికెట్‌. లోపలంతా పక్కా ‘ఏ’ సర్టిఫికెట్‌ బొమ్మ. ఇంతకీ ఈ అవంతిక ఎవరు? ‘మన్మథుడు’తో తనకున్న అనుబంధం ఏంటి? ఈ విషయలు తెలియాలంటే ‘మన్మథుడు 2’ చూడాల్సిందే. నాగార్జున కథానాయకుడిగా  నటిస్తున్న చిత్రమిది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. మనం ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయాకామ్‌ 18 సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. చిత్రీకరణ పూర్తయింది. ఆగస్టు 9న విడుదల చేస్తున్నారు. మంగళవారం అవంతికగా రకుల్‌ పాత్రని పరిచయం చేస్తూ ఓ టీజర్‌ని  విడుదల చేశారు. ‘‘ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. అవంతికగా రకుల్‌ పాత్ర గుర్తుండిపోతుంది. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తామ’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: చైతన్య భరద్వాజ్‌.