మేనిఫెస్టో అమలుకే ప్రాధాన్యం ?

0
30

శాసనసభకు తొలి బడ్జెట్‌ సమర్పించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

న్నికల ముందు నుంచీ మనసా వాచా ఒకటే ‘నవరత్న మంత్రం’ జపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. ఆంధ్ర జనం కట్టబెట్టిన అఖండ విజయం తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో.. ఆ నవ విధ సంక్షేమానికే పెద్ద పీట వేశారు. రైతులు, పేదలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వితంతువులు, వికలాంగులు… ఇలా అన్ని వర్గాల వారికీ బాసటగా నిలిచేందుకు, ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా అండనిచ్చేందుకు ఉద్దేశించిన పథకాలకే భూరి కేటాయింపులు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శుక్రవారం శాసనసభకు సమర్పించిన రూ.2.27 లక్షల కోట్ల బడ్జెట్లో రూ.75 వేల కోట్లకు పైగా సంక్షేమ రంగానికే అందించటం విశేషం. రైతన్నల పైన అయితే ఏకంగా రూ.28,866 కోట్ల వరాల వాన కురిపించారు. మొత్తానికి బడ్జెట్‌ ఆసాంతం నవరత్నాల ధగధగలే ప్రస్ఫుటంగా కనిపించే అంశం!!

న్నికల హామీల్లో సుమారు 80% తొలి బడ్జెట్‌లోనే అమలు చేయబోతున్నాం. పరిస్థితులు అనుకూలిస్తే మిగిలిన 20% హామీలను వచ్చే ఏడాది బడ్జెట్‌లో అమల్లోకి తెద్దాం. దీనివల్ల తొలి రెండేళ్లలోనే ఎన్నికల ప్రణాళికలోని హామీలను వంద శాతం నెరవేర్చినట్లవుతుంది.

– మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి

దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అత్యంత దయనీయ ఆర్థిక స్థితిని మా ప్రభుత్వం వారసత్వంగా పొందింది. రాష్ట్రానికున్న పరిమిత ఆదాయాల్లోనే ఖర్చులు భరించాల్సి ఉంది. ఈ ప్రభుత్వానికి ప్రాప్తించిన ద్రవ్య స్థితి వల్ల కఠిన ప్రత్యామ్నాయాలను చూసుకోవాల్సి వచ్చింది. 2022నాటికి రాష్ట్రంలో లేమితనం లేకుండా చూడాలని భావిస్తున్నాం.

-ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌


రాష్ట్ర బడ్జెట్‌ (2019-20)
రూ.2,27,975కోట్లు
వరాల జల్లులు

* రూ.5 లక్షల కంటే తక్కువ వార్షికాదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు.
* కార్పొరేట్‌ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దేందుకు రూ.1500 కోట్లు
* ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి    రూ.24 వేల ఆర్థిక సాయం.
* సొంత వాహనం ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఏడాదికి రూ.10వేల ఆర్థిక సాయం
* కాపు కార్పొరేషన్‌కు రూ. 2వేల కోట్లు
* 2021 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి.