అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’

0
75

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. పోస్టర్‌లో నాగ్‌ ఫ్రస్ట్రేషన్‌తో ఉంటే ఆయన్ని చూస్తూ రకుల్‌, లక్ష్మి, ఝాన్సీ తదితరులు నవ్వుకుంటున్నారు. వెన్నెల కిశోర్‌, కీర్తి సురేశ్‌ కీలక పాత్రల్లో నటించారు. అక్కినేని కోడలు సమంత అతిథి పాత్రలో మెరవనున్నారు. ఇటీవల చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ఆనంది ఆర్ట్స్‌ అఫీషియల్‌ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. ఆగస్ట్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.