జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా ఇవ్వలేరు ప్రత్యేక హోదా అసాధ్యం

0
72

అమరావతి: ప్రస్తుత పరిస్థితుల్లో జగన్‌, చంద్రబాబు ప్రధానిగా ఉన్నా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేరని రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ప్యాకేజీ సాధించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. భాజపాలో చేరాక తొలిసారి ఆదివారం విజయవాడ వచ్చిన ఆయనకు భాజపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలోని ఒక కన్వెన్షన్‌ హాలులో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో, సాయంత్రం విలేకరులతో సుజనా మాట్లాడారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ధర్మ పోరాట దీక్షల పేరుతో అధర్మ పోరాటాలు చేశారని విమర్శించారు. దేశవాప్తంగా పరిమిత స్థానాల్లో భాజపా విజయం సాధించి ఉంటే హోదా డిమాండు చేసే వాళ్లమని జగన్‌మోహన్‌రెడ్డి అనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.
రెండేళ్లలో చంద్రబాబు జైలుకే: ధియోదర్‌
కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తెదేపా నేతలు లూటీ చేశారని, రెండేళ్లలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయమని భాజపా రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్‌ఛార్జి సునీల్‌ ధియోదర్‌ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయని, అధికార పార్టీ వైకాపాకు భాజపా ఒకటే ప్రత్యామ్నాయమని తెలిపారు.