సీఎం తీరుతో ప్రజాస్వామ్యానికి చేటు

0
49

మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: శాసనసభలో ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి చేటని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కీలక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేదని పేర్కొన్నారు. నరసరావుపేటలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. పేదలను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి వంటివి బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దాడులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. తమ కుటుంబ సభ్యులపై 17 తప్పుడు కేసులు మోపారని తెలిపారు. ఒక్క కేసులో ఆధారం చూపినా తాను దేనికైనా సిద్ధమన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు. మందుల కంపెనీ మూసి వేయిస్తామని ఎమ్మెల్యే మాట్లాడటం సరికాదన్నారు.